శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మే 2022 (11:59 IST)

అమలాపురంలో త్వరలోనే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ : డీఐజీ పాల్‌రాజు

minister home in fire
కోనసీమ జిల్లా పేరును మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ కారణంగా హింస చెలరేగడంతో ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళకు నిప్పు పెట్టారు. దీంతో జిల్లా కేంద్రమైన అమలాపురంను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులోభాగంగా, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. 
 
ఈ నేపథ్యంలో డీఐజీ పాలరాజు మాట్లాడుతూ, కోనసీమలో జరుగుతున్న అల్లర్ల పుకార్లపై ఎవరూ నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. అమలాపురంలో త్వరలోనే ఇంటర్నెట్ సేవలు పునరుద్దరిస్తామన్నారు. అదేసమయంలో కోనసీమలో జరుగుతున్న అల్లర్లపై పుకార్లు నమ్మొద్దని కోరారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. కోనసీమలో పోలీసు బందోబస్తు ఇంకా కొనసాగుతోందన్నారు. 
 
మంత్రి విశ్వరూపం, ఎమ్మెల్యే సతీష్ గృహాలతో పాటు కలెక్టర్ కార్యాలయాన్ని దగ్ధం చేసిన ఘటనలై నిందితులను గుర్తించామన్నారు. అదేసమయంలో అమలాపురం పట్టణంలో 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్ 30లు అమల్లో ఉన్నాయన్నారు. అందువల్ల ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆయన హెచ్చరించాు. ఇదిలావుంటే కోనసీమ అల్లర్లు జరిగిన ఐదు రోజులైనా ఇప్పటివరకు అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించలేదని తెలిపారు.