శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (19:56 IST)

సుధ కొంగరతో హోంబలే నిర్మాణ సంస్థ కొత్త చిత్రం

sudha kongara
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న మహిళా దర్శకులలో ఒకరు సుధ కొంగర. ఈమె గతంలో హీరో సూర్యను డైరెక్ట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన "ఆకాశం నీ హద్దురా" అనే చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం తర్వాత సుధ కొంగరతో పాటు హీరో సూర్యకు కూడా మంచి పేరు వచ్చింది. వాస్తవ కథతో ఈ చిత్రాన్ని తెరక్కించారు. 
 
ఇపుడు మరోమారు వాస్తవ సంఘటనతో ఓ కథను సిద్ధం చేశారు. దీని ఆధారంగానే ఈ కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే.. "కేజీఎఫ్" వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందుకు సంబంధించి ఆ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. 
 
అయితే, ఈ చిత్రంలో హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. దాదాపుగా సూర్యనే నటిస్తారనే టాక్ వినిపిస్తుంది. అయితే, సూర్య పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి పూర్తయితేగానీ ఈ కొత్త చిత్రం పట్టాలెక్కే అవకశం లేదు. దీనిపై సస్పెన్స్ వీడాలంటే నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన చేయాల్సివుంటుంది.