గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 30 అక్టోబరు 2021 (17:14 IST)

డా.రవికిరణ్ ప్రతిభకు నిలువుటద్దం పట్టిన "రాంగ్ స్వైప్"

డాక్టర్ రవికిరణ్ గడలి దర్శకత్వంలో 'మెరూన్ వాటర్స్ ఎక్స్ లెన్స్" పతాకంపై డాక్టర్ ప్రతిమారెడ్డి నిర్మించిన సందేశభరిత వినోదాత్మక చిత్రం "రాంగ్ స్వైప్". క్షణిక సుఖం కోసం పక్క దారి పడితే... ఎటువంటి విపరిణాలను ఎదుర్కోవలసి వస్తుందో ఎంటర్టైనింగ్ వేలో చూపించే ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ "ఊర్వశి ఓటిటి" ద్వారా నవంబర్ 1న విడుదల కానుంది. 
 
 
స్వతహా డాక్టర్ అయిన రవికిరణ్... సినిమా మాధ్యమం పట్ల విపరీతమైన ప్యాషన్ తో.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు స్వయంగా సమకూర్చుకుని, దర్శకత్వం వహించడంతోపాటు... ఛాయాగ్రహణం కూడా అందించడం విశేషం. అంతేకాదు, ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కూడా పోషించారు. డాక్టర్ ఉదయ్ రెడ్డి, డాక్టర్ శ్రావ్యనిక, రాధాకృష్ణ, అనికా ప్రేమ్ ముఖ్యపాత్రలు పోషించారు.
 
 
నిర్మాత డాక్టర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ... "లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్ చాలా గొప్పగా తీర్చిదిద్దారు. అన్నీ తానే అయి ముందుండి నడిపించారు. మెసేజ్ కి ఎంటర్టైన్మెంట్ జోడించి రూపొందిన "రాంగ్ స్వైప్" అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. కబీర్ రఫీ సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు" అన్నారు.