ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2016 (13:48 IST)

3నెలల చిన్నారిని చెట్ల పొదల్లో వదిలేశారు: రమ్య తరహా ఘటన... సంజన బ్రెయిన్ డెడ్

హైదరాబాద్‌లో దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. షీ టీమ్స్ ఉన్నా ఓవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే.. మరోవైపు చిన్నారులపై నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హయత్‌నగర్ సమీపంలో 3 నెలల చిన్నారిని చెట్ల పొదల

హైదరాబాద్‌లో దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. షీ టీమ్స్ ఉన్నా ఓవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే.. మరోవైపు చిన్నారులపై నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హయత్‌నగర్ సమీపంలో 3 నెలల చిన్నారిని చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ బిడ్డను కన్నతల్లే వదిలి వెళ్ళిందా.. అనేది తెలియరాలేదు. 
 
మరోవైపు భాగ్యనగరంలో మరో ప్రమాదానికి చిన్నారి బలైపోయింది. తాగి నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్‌లు రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికే పోలీసులు తాగుడుమూకలను ఏరిపారేయడంలో విఫలమవుతున్నారు. తాగుబోతుల నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్‌తో చిన్నారి రమ్య కుటుంబం బలైపోయిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది.
 
భాగ్యనగరంలో రమ్య తరహా ప్రమాదం మరొకటి జరిగింది. పెద్ద అంబర్ పేట వద్ద ఔటర్ రింగు రోడ్డులో బస్సు కోసం తల్లీకూతుళ్లు నిరీక్షిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారును ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ వారిని గుద్దేయడంతో సంజన అనే అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయ్యింది. సంజన తల్లి శ్రీదేవి పరిస్థితి విషమంగా ఉంది. నిందితులు కారును వదిలేసి పరారయ్యారు. కారులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లీకూతుళ్లకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.