శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (14:52 IST)

‘టిక్‌ టాక్‌’ మోజులో...ఏం చేశాడో చూడండి

‘టిక్‌ టాక్‌’ మోజు పచ్చని కాపురంలో చిచ్చు రేపింది. ఇంట్లో ఓ భార్య ఉండగానే మరో భార్యను వెతుక్కున్నాడు కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం వాసి సత్యంరాజు.

వీటీపీఎస్‌ ఉద్యోగి అయిన సత్యంరాజు 2009లో అనురాధను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ఉండగానే టిక్‌ టాక్‌లో పరిచయమైన హైదరాబాద్‌ యువతిని ఐదు నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంపై గతంలో పెద్దల వద్ద పంచాయతీ జరిగింది.

మారతానని అప్పట్లో అందరిముందు మాట ఇచ్చిన సత్యంరాజు ఆ తర్వాత ఎప్పటిలాగే భార్యకు దూరంగా ఉంటున్నాడు. మానసికంగా తనను వేధిస్తున్నాడని ఆయన భార్య అనురాధ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన తల్లిదండ్రులను భార్య అనురాధ సరిగా చూసుకోవడం లేదని సత్యంరాజు పోలీసుల వద్ద ఆరోపించాడు. అనురాధ ఫిర్యాదు మేరకు పోలీసులు సత్యంరాజుపై కేసు నమోదు చేశారు.