గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (10:37 IST)

జేసీ బ్రదర్స్ గృహాలు - ఆఫీసుల్లో తనిఖీలు

jc prabhakar reddy
అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన జేసీ బ్రదర్స్‌గా ఉన్న సీనియర్ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిల గృహాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. 
 
ముఖ్యంగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు చేశారు. 
 
తాడిపత్రితో పాటు హైదాబాద్ నగరంలోని వారి నివాసాల్లో అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 20 మంది అధికారులు వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల సందర్భంగా తాడిపత్రిలో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటుచేశారు.