1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (15:08 IST)

ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పుల తడకే : తమిళనాడీ సీఎం పళనిస్వామి

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి మండిపడ్డారు. ఈ ఫలితాలన్నీ తప్పుల తడకేనని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలను డీఎంకే స్వీప్ చేస్తుందని ఈ ఫలితాలు వెల్లడించాయి. ఒక్క వేలూరు మినహా మిగిలిన 38 సీట్లలో డీఎంకేకు 27 నుంచి 34 సీట్లు వస్తాయని వివిధ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి 11 వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి.
 
ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధాలే అని ఆయన అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలలో అన్నాడీఎంకే కూటమి మొత్తం 39 సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
 
2014 సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే, వాటి అంచనాలను తలకిందులు చేస్తూ అన్నాడీఎంకే ఏకంగా 37 సీట్లను కైవసం చేసుకుని... అందరికీ షాక్ ఇచ్చింది.