మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 మార్చి 2018 (19:24 IST)

23న రాజ్యసభ ఎన్నికలు... దేశ వ్యాప్తంగా 58 సీట్లకు ఓటింగ్

దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న, పదవీ కాలం ముగిసిన రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఈనెల 23వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఈనెల 5వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది.

దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న, పదవీ కాలం ముగిసిన రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఈనెల 23వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఈనెల 5వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. 16 రాష్ట్రాలకు చెందిన 58 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ముగియనుండటంతో ఆయా స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. 
 
అయితే, రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఏపీలో మూడు, తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కె.చిరంజీవి, రేణుక చౌదరి, టి.దేవేందర్‌ గౌడ్‌, తెలంగాణలో సి.ఎం రమేష్‌, రాపోలు ఆనంద్‌ భాస్కర్‌, పాల్వాయి గోవర్థన్‌ రెడ్డిల పదవీ కాలం ఏప్రిల్‌ 2తో ముగియనుంది. పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి ఇటీవలే మృతి చెందారు. 
 
ఇకపోతే, పదవీ విరమణ చేసేవారిలో నలుగురు కాంగ్రెస్‌ సభ్యులు కాగా, ఇద్దరు టిడిపి సభ్యులు. దేశవ్యాప్తంగా రిటైరయ్యే ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, జేపీ నడ్డా, ప్రకాశ్‌ జవదేకర్‌, తావర్‌ చంద్‌ గెహ్లాట్‌, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, నరేష్‌ అగర్వాల్‌, జయా బచ్చన్‌ తదితరులు వున్నారు.