శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 జులై 2024 (09:30 IST)

నా భార్యపై అత్యాచారం చేసి... బిడ్డ పుట్టేలా చేశారు.. : శాంతి భర్త మదన్ మోహన్

madan mohan
సస్పెండ్‌కు గురైన ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్.. వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య శాంతిపై అత్యాచారం చేసి, ఓ బిడ్డ జన్మకు కారణమయ్యారని, అందువల్ల ఆయన రాజ్యసభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పైగా, తన భార్య జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి మాత్రం తాను కాదని, ఆ బిడ్డకు తండ్రి ఎవరో నిగ్గు తేల్చాలని కోరారు. తాను మాత్రం ఆ బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డి అని ఘంటాపథంగా చెప్పగలనని తెలిపారు. ఒక వేళ తాను చేసేవి ఆరోపణలు అయితే, విజయసాయి రెడ్డి డీఎన్ఏ పరీక్ష చేయించుకుని తన నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, 'నా భార్య శాంతి ఏపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్... వీరిద్దరూ నా భార్యను కుట్రపూరితంగా లోబర్చుకుని, వేలాది కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నారు. 
 
భూ అక్రమాలతో ఆగకుండా, వారు ఇంకా ముందుకెళ్లి నా భార్యతో అక్రమంగా బిడ్డను పొందారు. నా భార్యపై అత్యాచారం చేశారు.నా భార్య ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ నా బిడ్డ కాదు. వాళ్లు తప్పు చేశారు. అందుకే నేను మీడియా ముందుకు వచ్చాను. విజయసాయిరెడ్డి, పోతిరెడ్డి సుభాష్ డీఎన్ఏ టెస్టు చేయించుకుని, తమ శీలాన్ని నిరూపించుకోవాలి.... ఆ బిడ్డకు తండ్రెవరో తేలాలి. ముఖ్యంగా విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్టు చేయించుకోవాల్సిందే. ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. రేపు రాష్ట్రపతిని, రాజ్యసభ చైర్మన్‌ను కూడా కలుస్తున్నాం' అని మదన్ మోహన్ వెల్లడించారు.