బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 21 నవంబరు 2016 (10:16 IST)

ఈ వయసులో జనసేనతో పెళ్లి అవసరమా? పునరాలోచనలో పడిన కిరణ్‌

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పునరాలోచనలో పడ్డారు. జనసేన పార్టీలో చేరేందుకు వెనుకంజ వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. జనసేనలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్దం చేసుకున్న కిరణ్‌ కుమార్‌ రె

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పునరాలోచనలో పడ్డారు. జనసేన పార్టీలో చేరేందుకు వెనుకంజ వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. జనసేనలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్దం చేసుకున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇపుడు కాస్త వెనక్కి తగ్గారు. అనుచరులు, మాజీ ఎమ్మెల్యేల ఒత్తిడితో జనసేనలోకి వెళ్ళడాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. 
 
కారణం జనసేనలోకి వెళితే పవన్‌ కళ్యాణ్‌కు తప్ప మనకు విలువ ఉండదని, మనల్ని ఎవరూ పట్టించుకోరని చెప్పడంతో కిరణ్‌ బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ పార్టీలో చేరాలన్న విషయాన్ని తన అనుచరులే నిర్ణయించడంతో ఇది వేరే గతి లేక వైకాపాలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారట. 
 
దీనిపై ఇప్పటికే జగన్‌తో కూడా సంప్రదింపులు జరిపేశారని సమాచారం. జగన్‌ మీరు రావాలే గానీ మేము ఎప్పుడూ ఆహ్వానించేందుకు సిద్ధమంటూ కిరణ్‌కు రెడ్‌ కార్పెట్‌ పరిచేందుకు సిద్ధమయ్యారట. దీంతో ఈనెల 23వతేదీన జనసేన పార్టీలోకి వెళ్ళడానికి కిరణ్ విరమించుకున్నారు.