గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 14 నవంబరు 2016 (14:03 IST)

దూకుడు పెంచిన కిరణ్‌... 23వ తేదీన మాజీ ఎమ్మెల్యేలతో జనసేనలోకి...

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి దూకుడు పెంచారు. జనసేన పార్టీలోకి చేరికను ఇప్పటికే ఖరారు చేసుకున్న కిరణ్‌ తనకున్న సన్నిహితులతో కలిసి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అది కూడా కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాప

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి దూకుడు పెంచారు. జనసేన పార్టీలోకి చేరికను ఇప్పటికే ఖరారు చేసుకున్న కిరణ్‌ తనకున్న సన్నిహితులతో కలిసి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అది కూడా కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన మాజీలను తీసుకుని వెళ్లనున్నారు. ఇప్పటికే అందరితోను సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బెంగుళూరులో మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు.
 
జనసేన పార్టీలో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతానని, రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసి పార్టీని గెలిపిద్దామని ప్రజాప్రతినిధులకు చెప్పినట్లు సమాచారం. దీంతో వారంతా కిరణ్‌ వెంట నడవడానికి సిద్ధమయ్యారు. ఒకవైపు పవన్‌తో కూడా కిరణ్‌ చేసిన సంప్రదింపులన్నీ ఫలించడంతో పార్టీలోకి చేరిక సులభమైంది.
 
ఈనెల 23వ తేదీన హైదరాబాద్‌లోని పవన్‌ కళ్యాణ్‌ ఇంటి వద్దే కిరణ్‌ ముందుగా పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అంతేకాకుండా జనసేనలో చేరిన తర్వాత పార్టీ ముఖ్య నేతలతో ఒక సభను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.