1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జూన్ 2024 (12:45 IST)

బిడ్డ కోసం ఆక్సిజన్ సిలిండర్‌ను మోసిన తండ్రి (వీడియో)

oxygen cylinder
oxygen cylinder
కేజీహెచ్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. విశాఖపట్నం - కేజీహెచ్‌ ప్రసూతి ఆస్పత్రిలో శిరీష ఆమె మహిళ నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో, ఆ శిశువును ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు చెప్పారు. 
 
షిఫ్ట్ చేయడానికి ఆసుపత్రి సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి.. నర్సు బిడ్డను పట్టుకొని ముందు నడవగా.. తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్‌ను భుజాన వేసుకొని ఆమె వెంట వెళ్లారు. 
 
బిడ్డ కోసం ఆక్సిజన్ సిలిండర్‌ను తండ్రి భుజంపై మోసుకెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన కష్టం చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.