6వ తేదీ ఆదివారం చేపల మార్కెట్లకు 4 గంటలు మాత్రమే అనుమతి
కరోనా ఉధృతి నేపథ్యంలో మార్కెట్లలో రద్దీని నియంత్రించేందుకు 6వ తేదీ ఆదివారం నగరంలోని చేపల హోల్‌సేల్ మార్కెట్, రిటైల్ వ్యాపారానికి ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ ప్రకటనలో తెలిపారు.
వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు నగరంలోని చేపల మార్కెట్లు ఆదివారం పరిమితంగా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. నగర పాలక సంస్థ కబేళా యథావిధిగా పని చేస్తోందన్నారు. నగరంలో 144 సెక్షన్ అమ లులో ఉన్నందున మార్కెట్లు, షాపుల్లో ఐదుగురికి మించి గుమికూడకుండా షాపుల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. దూరందూరంగా ప్రజలు క్రమ పద్దతిలో కొనుగోలు చేసుకొనేలా మార్కింగ్ ఏర్పాటు చేసుకోవని సూచిస్తూ, బహిరంగ ప్రదేశాలలో ఎవరు చేపల విక్రయాలు నిషేదించుట జరిగిందని ఎవరైనా నగరపాలక అధికారులు సిబ్బంది యొక్క ఆదేశాలు ఉల్లఘించిన అట్టి వారిపై ఖఠీన చర్యలు తప్పవని హెచ్చరించారు.