1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : సోమవారం, 16 నవంబరు 2020 (14:40 IST)

24 గంటల్లో 30వేల కరోనా కేసులు.. 4 నెలల్లో మొదటిసారి..

దేశంలో కరోనావైరస్ విజృంభణకు అడ్డుకట్టపడకపోయినా.. కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం ఊరట కలిగించే అంశం. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 30,548 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 88,45,127గా ఉంది. అయితే, నిన్న ఒక్కరోజే భారీ తగ్గుదల కనిపించింది. జులై 13 తరవాత ఒకరోజులో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
 
అలాగే, ఆదివారం నిర్ధారణ పరీక్షల సంఖ్య (8,61,706) తగ్గడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. 
 
ఇక, నిన్న ఈ మహమ్మారి కారణంగా 435 మంది ప్రాణాలు కోల్పోగా.. దేశవ్యాప్తంగా ఈ మరణాల సంఖ్య 1,30,070కి చేరుకుంది. 88లక్షల పైచిలుకు మంది వైరస్‌ బారిన పడినప్పటికీ, వారిలో 82,49,579 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు, గత కొద్ది రోజులుగా క్రియాశీల కేసుల సంఖ్య ఐదు లక్షల లోపే ఉంటుంది. 
 
ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 5.26 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 93.27 శాతానికి పెరిగింది. ఇదిలా ఉండగా..రోజూవారీ సగటు కేసుల సంఖ్య ఐదు వారాలుగా క్రమంగా తగ్గుతున్నట్లు ఇటీవల మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.