శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (20:27 IST)

కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. 30 విద్యార్థుల అస్వస్థత

చిత్తూరు జిల్లా, కుప్పంలో ఉన్న ద్రవిడ విశ్వవిద్యాలయంలో కలుషిత ఆహారం ఆరగించిన పలువురు విద్యార్థినిలు అస్వస్థతకు లోనయ్యారు. ఈ వర్శిటీ ప్రాంగణంలోని అక్క మహాదేవి హాస్టల్‌లో ఈ ఫుడ్ పాజయిన్ ఘటన జరిగింది. ఈ కలుషిత ఆహారాన్ని ఆరగించిన విద్యార్థినిల్లో 30 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 
 
దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో 17 మంది విద్యార్థినుల ఆరోగ్యం విషమంగా ఉండటంతో వీరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ ఫుడ్‌పాయిన్‌కు గల కారణాలపై అధికారులు యూనివర్శిటీ అధికారులు ఆరా తీస్తున్నారు.