శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 20 మార్చి 2019 (20:02 IST)

విశాఖపట్నం జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ ( సి.బి.ఐ.మాజీ జె.డి.)

శాసన సభ, పార్లమెంట్ స్థానాలకు జనసేన పార్టీ తరపున పోటీ చేయనున్న మరికొంత మంది అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ విడుదల చేసారు.
 
లోక్ సభ అభ్యర్థి
విశాఖపట్నం: శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ ( సి.బి.ఐ.మాజీ జె.డి.)
 
శాసనసభ అభ్యర్థులు
విశాఖపట్నం ఉత్తరం     : పసుపులేటి ఉషా కిరణ్ 
విశాఖపట్నం దక్షిణం     : శ్రీ గంపల గిరిధర్ 
విశాఖపట్నం తూర్పు     : శ్రీ  కోన తాతా రావు 
భీమిలి                      : శ్రీ పంచకర్ల సందీప్ 
అమలాపురం              : శ్రీ శెట్టిబత్తుల రాజబాబు 
పెద్దాపురం                 : శ్రీ తుమ్మల రామ స్వామి ( బాబు )
పోలవరం                   : శ్రీ చిర్రి బాల రాజు  
అనంతపురం               : శ్రీ టి.సి.వరుణ్ 
శ్రీ రాజగోపాల్‌కు పార్టీ ఉన్నత పదవి 
 
జె.డి.లక్ష్మీనారాయణ తోడల్లుడు, అనేక విశ్వవిద్యాలయాలకు ఉప కులపతిగా పదవి భాద్యతలు నిర్వర్తించిన శ్రీ రాజగోపాల్ జనసేన పార్టీలోని ఉన్నతమైన ఒక కమిటీకి ఛైర్మన్‌గా నియమించనున్నట్లు శ్రీ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తొలుత శ్రీ రాజగోపాల్‌ని అనంతపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. అయితే ప్రాంతీయ సమీకరణాల నేపథ్యంలో శ్రీ రాజగోపాల్‌ని అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయమని కోరగా ఆయన శాసన సభ స్థానాన్ని టి.సి. వరుణ్‌కు కేటాయించడానికి సమ్మతించి ఆయన పార్టీ భాద్యతలు నిర్వర్తించండానికి మొగ్గు చూపారు. పార్టీకి సేవ చేయడానికి ముందుకు వచ్చిన శ్రీ రాజగోపాల్‌కి శ్రీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.