శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (09:52 IST)

పేదలకు ఉచిత కళ్లజోళ్లు

రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు పథకం ద్వారా సుమారు కోటిన్నర మంది పేదలకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణి చేయనుంది. ఇందుకోసం రూ.250 కోట్ల వరకు ఖర్చుచేస్తోంది. మరో 8లక్షల మందికి క్యాటరాక్ట్, ఇతర శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు.

కంటి వెలుగు పథకం అమలు కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రూ.500 కోట్లను కేటాయించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 2022 జనవరి 31 వరకు 6 దశల్లో ఈ పథకం.. కార్యక్రమాలు జరిగేలా వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు చేసింది. ఒక్కో కిట్ వ్యయం రూ.150 తొలి, రెండు దశల్లో భాగంగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 70 లక్షల మందికి కంటి పరిక్షలు నిర్వహిస్తారు.

ఈ క్రమంలో నిర్ధేశిత చార్టులోని అక్షరాలను 10 అడుగుల దూరం నుంచి వారి చేత చదివిస్తారు. ఇందుకోసం ప్రతి పాఠశాలలో టార్చ్​​లైట్, చార్టు, టేపును కిట్ రూపంలో పంపిణీ చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.ఒక్కో కిట్​కు రూ 150 వరకు ఖర్చుపెడుతున్నారు.

మూడు నుంచి ఆరు దశల్లో సుమారు 4 కోట్ల మందికి కంటి పరిక్షలు జరుపుతారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సల చేపడతారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శస్త్ర చికిత్సలు చేసిన సంస్థలకు చెల్లింపులు జరుగుతాయి. డయాబటిక్, రెటినోపతి, చైల్డ్​హుడ్​, బ్లైండ్​నెస్ గ్లకోమా కేసులకు రూ.2 వేల చొప్పున చెల్లించనున్నారు.

అంధత్వంలో 80శాతం సమస్యలకు ముందస్తు పరిక్షలు ద్వారా తగ్గించవచ్చని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.ఈ పథకం అమలులో భాగంగా తాత్కాలికంగా 400 ఆప్తమాలిక్ అసిస్టెంట్ నియామకాలు చెపట్టపోతున్నామని ఆయన తెలిపారు.