శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (11:56 IST)

రేపటి నుండి శ్రీ శార్వరి నామ సంవత్సర భవానీ దీక్షలు.. దీక్ష నిబంధనలు ఇవే

విజయవాడ నందు ది.5.1.2021 నుండి ది.09.01.2021 వరకు నిర్వహించు భవానీ దీక్షలు – 2020ను పురస్కరించుకొని చేపట్టవలసిన వివిద రకముల నిర్వహణా ఏర్పాట్లు మరియు దీక్షల విరమణకు విచ్చేయు దీక్షాధారులకు,భక్తులకు కల్పించవలసిన మౌలిక వసతుల గురించి వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలెక్టరు క్యాంపు ఆఫీస్ నందు నిర్వహించిన సమన్వయ సమావేశము నందు కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా తీసుకొన్న ప్రాధమిక నిర్ణయములు : 
 
1) భవానీ దీక్షలు – 2020ను పురస్కరించుకొని దీక్షా విరమణలు ది.05.01.2021 నుండి ది.09.01.2021 వరకు శ్రీఅమ్మవారి దర్శనము ఉదయం 4-00 గం.ల నుండి రాత్రి 8-00 గం.ల వరకు కల్పించబడును.(మొదటి రోజు  (05-01-2021) న ఉదయం 05.30 గం. లకు దర్శనము ప్రారంభం)

2) శ్రీ అమ్మవారి దర్శనమునకు విచ్చేయు ప్రతి భక్తుడు ఆన్ లైను నందు టోకెన్ తప్పనిసరిగా తీసుకొని , టొకెన్ తో పాటు ఏదైనా ఐ.డి. ప్రూఫ్ తప్పని సరిగా తీసుకొనిరావలెను. లేనియెడల దర్శనమునకు అనుమతించబడదు. (website: www.kanakadurgamma.org , Mobile App: kanakadurgamma)

3) కరోనా నియంత్రణ దృష్ట్యా దర్శనమునకు వచ్చు ప్రతి భక్తుడు తప్పకుండా మాస్కు ధరించి స్వియ దూరము పాటించవలెను. 

4) కరోనా నిబంధనలు అనుసరించి శ్రీ అమ్మవారి దర్శనమునకు వచ్చు 10 సంవత్సరములలోపు పిల్లలు, 65 సంవత్సరముల పైబడినవారు , దివ్యాంగులు, వృద్దులు, గర్బిణీ స్త్రీలు దర్శనమునకు అనుమతించబడరు.
 
5) అంతరాలయ దర్శనము పూర్తిగా నిలుపుదల చేయడమైనది. 

6) కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా దీక్షల విరమణల రోజులలో ఒక రోజుకు 10,000 మందికి మాత్రమే దర్శనమునకు అనుమతించుట. దీక్షాధారులకు 9,000 నెం. ఉచిత టికెట్లు, భక్తులకు రూ.100/-లు టికెట్లు 1,000నెం.ల చొప్పున విక్రయించి దర్శనమునకు అనుమతించుట.

7) ఈ సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా గిరి ప్రదక్షిణ నిలుపుదల చేయడమైనది.

8) కేశ ఖండన (తలనీలాలు సమర్పించుట) నిలుపుదల చేయడమైనది. 

9) నదీ స్నానములు మరియు జల్లు స్నానములు నిలుపుదల చేయడమైనది.

10) కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా దర్శనమునకు విచ్చేయు భక్తులు భౌతిక దూరం పాటించు విధముగా ప్రభుత్వము వారి ఆదేశముల ప్రకారము మరియు కరోనా నిబంధనలు ప్రమాణాలకు లోబడి క్యూ లైన్లు కెనాల్ రోడ్ , వినాయకుని గుడి వద్ద నుండి ప్రారంభం. 

11) దీక్ష స్వీకరించిన భక్తులు వారి యొక్క ఇరుముడులను దేవస్థానమునకు సమర్పించి తదుపరి మాలా విరమణను వారి వారి స్వగ్రామముల యందు గురు భవానీలచే మాల విరమణ చేసుకొనవలెను.

12) శ్రీ అమ్మవారి దర్శనార్ధమై విచ్చేయు భవానీ దీక్షాధారులు మరియు భక్తుల సౌకర్యార్ధం వివిధ ప్రాంతములలో అధిక సంఖ్యలో తాత్కాలిక మరుగు దొడ్లను ఏర్పాటు చేయుట.

13) జిల్లా వైద్యారోగ్య శాఖ వారి ఆధ్వర్యములో 5 ప్రదేశములలో మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేపట్టుట. 

14) శ్రీ అమ్మవారి ఉచిత ప్రసాదమును ఉదయం 6-00 గం.ల నుండి సాయంత్రం 6-00 గం.ల వరకు ప్యాకెట్ల రూపములో దీక్షాధారులు మరియు భక్తులకు వితరణ చేయుట.

15) సుమారు 10,00,000 సంఖ్యలో లడ్డూ ప్రసాదములను అందుబాటులో ఉంచుటకు చర్యలు తీసుకొనడమైనది. 

16) కనకదుర్గనగర్ నందు ప్రసాద విక్రయ కేంద్రముల వద్ద భౌతిక దూరం పాటించు విధముగా ప్రసాదము కౌంటర్లు  ఏర్పాటు చేయడమైనది. 

17) భక్తుల సౌకర్యార్ధం కొండ దిగువ భాగమున మహామండపము వద్ద ఇరుముడి పాయింట్లు మరియు హోమగుండములు ఏర్పాటు చేయడమైనది.