శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (20:22 IST)

మెట్రో రైల్లో జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలు ప్రారంభం

షుగర్ బాక్స్ మెట్రో లోకల్ వై-ఫై సేవలు హైదరాబాద్​ మెట్రో రైల్లో జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా మెుబైల్‌ డాటా లేకుండానే వీడియోలు చూడొచ్చు.

మెట్రోలో షుగర్ బాక్స్ నెట్‌వర్క్‌ను ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. మొదటగా 10 మెట్రో స్టేషన్లలో.. షుగర్ బాక్స్ మెట్రో లోకల్ వై-ఫై సేవలు అందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

వినోదం, మేథోసంపత్తిని పెంచే పుస్తకాలు ఉంచాలని షుగర్​ బాక్స్​ యాజమాన్యాన్ని కోరినట్లు వెల్లడించారు. ఈ యాప్‌తో 3 నిమిషాల్లో సినిమా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. మెట్రో స్టేషన్లలో ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.