బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 9 ఆగస్టు 2017 (22:08 IST)

గంజాయి.... తెనాలి వయా తిరుపతి టు విల్లుపురం

తిరుపతిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి తమిళనాడు రాష్ట్రం విల్లుపురంకు 24 కేజీల గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 2 లక్షల రూపాయల

తిరుపతిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి తమిళనాడు రాష్ట్రం విల్లుపురంకు 24 కేజీల గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 2 లక్షల రూపాయల విలువ చేసే ఐదు బ్యాగులలోని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
 
నిందితుడు తమిళనాడు రాష్ట్రం తేనె ప్రాంతానికి చెందిన వారుగా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. గంజాయిని తరలిస్తున్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. తిరుపతిలో భారీగా గంజాయి పట్టుబడడం తీవ్ర కలకలం రేపుతోంది.