శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 26 మే 2018 (11:51 IST)

గజల్ శ్రీనివాస్‌పై కేసును వెనక్కి తీసుకోమని బెదిరింపులు.. అరెస్ట్

లైంగిక వేధింపుల కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌ ఇప్పటికే బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. తన సంస్థలోని ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో గజల్ శ్రీ

లైంగిక వేధింపుల కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌ ఇప్పటికే బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. తన సంస్థలోని ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో గజల్ శ్రీనివాస్ చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవించారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయటంతో జైల్‌ నుంచి విడుదల అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో గజల్ శ్రీనివాస్‌పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఓ మహిళ ఫోన్ చేసి తనను బెదిరిస్తోందని బాధిత మహిళ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఇప్పటికే గజల్ శ్రీనివాస్‌ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కృష్ణానగర్‌కు చెందిన ఓ మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్లు జ్యుడీషియల్ రిమాండ్‌లో కూడా వున్నాడు. 
 
తాజాగా ఈ కేసును వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ నెల 12న బాధిత మహిళకు విజయలక్ష్మి అనే మరో మహిళ ఫోన్ చేసి బెదిరించింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో బాధితురాలు మరోమారు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న పోలీసులు విజయలక్ష్మిపై కేసు నమోదు చేశారు.