శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 7 అక్టోబరు 2021 (14:30 IST)

పాఠ‌శాల నుంచి బాలిక కిడ్నాప్... అత్యాచారానికి తీసుకెళ్ళి...

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో పాఠశాలకు వెళ్లిన బాలికను దారి మ‌ళ్లించి అత్యాచారానికి య‌త్నించిన ఉదంత‌మిది. ఈ అగంతుకుడు రాకేష్ పాఠ‌శాల‌కు వెళ్లి వాళ్ళ అమ్మ రమ్మంటుందని చెప్పి, స్కూల్ టీచర్ పర్మిషన్ తీసుకుని బాలిక‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించాడు. అనంత‌రం అత్యాచారం చేయడానికి గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి బాలివ‌క‌ను బండి మీద ఎక్కించుకుని సుమారు 2 కిలోమీటర్లు తీసుకు వెళ్ళాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా, బాలిక భయపడి గట్టిగా అరచి కేకలు వేయడంతో, నిందితుడు రాకేష్ కూడా భయ పది ఆ బాలికను తిరిగి స్కూలుకు తీసుకు వచ్చి వదిలి వెళ్ళిపోయాడు. బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో పెదవేగి పోలీసులకు పిర్యాదు చేసారు.
 
 ఈ అఘాయిత్యానికి పాల్పడిన  రాకేష్ కి సహకరించి, ఒక రాజకీయ నాయకుడు  మైనర్ బాలికకు నిందితుడు నుండి 10 వేలు నష్ట పరిహారం ఇప్పించడానికి కేసు లేకుండా రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. దీనిపై పెద వేగి ఎస్ ఐ సుధీర్ ను వివరణ కోరగా, రాకేష్ అనే వ్యక్తి బాలికకు మాయ మాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి భయపడి బాలికను క్షేమంగా పాఠశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకు వచ్చి దింపి వెళ్లిపోయాడని విచారణలో తెలిసిందని చెప్పారు. నిందితుడు రాకేష్ పై కేసు నమోదు చేశామని ఎస్ ఐ సుధీర్ గురువారం తెలిపారు.