గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 2 అక్టోబరు 2020 (21:31 IST)

గోమాతకు సీమంతం, ఎక్కడ?

సాధారణంగా మహిళలకు కదా సీమంతం చేస్తారు. గోమాతలకు చేస్తారా అని ఆశ్చర్యంగా ఉంది కదూ. అవునండి.. విజయవాడలో గోమాతకు స్థానికులు పెద్దలు, మహిళలు ఘనంగా శ్రీమంతం నిర్వహించారు.
 
విజయవాడ పాత పాయకాపురంలో నివసిస్తున్న బిహెచ్ ఎస్వీ జానారెడ్డి నివాసంలో ఉంటున్న గోమాత నెలలు నిండి ఉంది. దీంతో జానారెడ్డి కుటుంబ సభ్యులు, స్థానిక పెద్దలు ఘనంగా శ్రీమంతం చేయించాలని ఆలోచన చేశారు.
 
హిందూ సాంప్రదాయం ప్రకారం అర్చకుల ద్వారా గోమాతకు చీర, జాకెట్, పండ్లు, పూలు పెట్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులు అయితే ఇంట్లో స్వయంగా వంటలు వండి తీసుకువచ్చి చలివిడి, పిండి పదార్థాలు గోమాతకు తినిపించి గోమాత ఆశీర్వాదం పొందుతున్నారు.