మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (14:24 IST)

నాలో నరుడే కాదు... నరసింహుడూ ఉన్నాడూ : నరసింహన్

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలో నరుడే కాదు.. నరసింహుడూ ఉన్నాడనీ వ్యాఖ్యానించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన చెప్పిన మాటలు ఆహూతులను ఆశ

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలో నరుడే కాదు.. నరసింహుడూ ఉన్నాడనీ వ్యాఖ్యానించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన చెప్పిన మాటలు ఆహూతులను ఆశ్చర్యపరిచాయి. ఇండియన్ స్పోర్ట్స్ మెడిసిన్ ఇనిస్టిట్యూట్ స్పార్క్ ట్రస్ట్ 13వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఆయన, 22 మందికి 'ప్రైడ్ ఆఫ్ ఇండియా' పురస్కారాలను అందించారు.
 
ఇందులో ఆయన మాట్లాడుతూ, తనలో నరసింహుడు కూడా ఉన్నాడని, కానీ తాను నరుడిగా మాత్రమే వచ్చానని, నరసింహుడిని బయటకు చూపడం లేదన్నారు. స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు అంటూ రోగుల్ని బెంబేలెత్తిస్తున్న ఈ రోజుల్లో వాటితో అవసరం లేకుండా రోగం నయం చేస్తున్న పుహళేంది గొప్ప వైద్యుడు అని అన్నారు.