శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2024 (20:52 IST)

తిరుమల క్యూలైన్లలో అన్నప్రసాదం.. లడ్డూ నాణ్యతపై కూడా దృష్టి

Tirumala
పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రం నిర్వహణకు సంబంధించి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన అనేక ఫిర్యాదులలో ఒకటి క్యూ లైన్ల వద్ద అన్నప్రసాదం సరఫరాను నిలిపివేయడం కూడా ఒకటి. క్యూలైన్‌లో షుగర్ పేషంట్లు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉంటారని, వారికి తప్పనిసరిగా అన్నప్రసాదం అందించాలని 2019కి ముందు ఆనవాయితీగా ఉందని.. కానీ వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు మాత్రం ఇందుకు డబ్బులు చెల్లించలేదని టాక్. 
 
ప్రస్తుతం కూటమి సర్కారు హయాంలో అన్నప్రసాదానికి సంబంధించి నిర్ణయాత్మక చర్య ప్రారంభించింది. సోషల్ మీడియాలో తాజా పోస్ట్‌ల ప్రకారం, తిరుమల క్యూ లైన్లలో అన్నప్రసాదం సరఫరా ప్రక్రియను పునఃప్రారంభించారు. 
 
క్యూ లైన్‌లో ఉన్న వారికి అన్నప్రసాదంగా సాంబారు అన్నం అందిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనిని బట్టి చూస్తే రానున్న రోజుల్లో టిటిడి అన్నప్రసాద సేవను కొనసాగించవచ్చు, ఇది యాత్రికులకు శుభవార్త. అంతే కాకుండా, లడ్డూల నాణ్యతను పరిష్కరించే దిశగా టీడీపీ సర్కారు చర్యలు తీసుకుంటోంది.