గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 19 జూన్ 2017 (14:04 IST)

విచ్చలవిడి మహిళ... ముగ్గురు మొగుళ్లు... ఇద్దరితో అక్రమ సంబంధం...

ఆమె జీవితం విచ్చలవిడిగా మారిపోయింది. గుంటూరుకు చెందిన మహిత అనే మహిళ ముగ్గురు భర్తలను చేసుకోవడమే కాకుండా ఇద్దరితో అక్రమ సంబంధం సాగించి ఆ తర్వాత ఆమెను అంతా వదిలించుకోవడంతో ఏ దారిలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొ

ఆమె జీవితం విచ్చలవిడిగా మారిపోయింది. గుంటూరుకు చెందిన మహిత అనే మహిళ ముగ్గురు భర్తలను చేసుకోవడమే కాకుండా ఇద్దరితో అక్రమ సంబంధం సాగించి ఆ తర్వాత ఆమెను అంతా వదిలించుకోవడంతో ఏ దారిలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. 
 
వివరాల్లోకి వెళితే... పాత గుంటూరు మణి హోటల్‌ ప్రాంతానికి చెందిన దేవదాస్‌ దంపతుల కుమార్తె అయిన 27 ఏళ్ల మహితకు 12 ఏళ్ల కిందట శేఖర్‌ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అతడిని వదిలేసి అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడిని పెళ్లాడింది. ఈసారి రెండో భర్తకు కూడా షాకిచ్చేసి శ్రీమన్నారాయణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 
 
కొంతకాలం అతడితో వుంటూనే మరో ఇద్దరితో అక్రమ సంబంధం కొనసాగించింది. దీనితో మూడో భర్త కూడా ఆమెను వదిలేశాడు. ఆ తర్వాత అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరు కూడా ఆమెను కాదు పొమ్మన్నారు. దీనితో ఏ దారి లేక మూడో భర్త వద్దకు వచ్చి తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేసింది. 
 
అతడు మొండి చేయి చూపించడంతో ఆగ్రహం చెందిన మహిత ఓ చేత్తో పురుగుల మందు మరో చేత్తో కూల్ డ్రింక్ పట్టుకుని రెండూ కలిపి తాగేసి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈమెను స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈ విషయం అంతా బయటకు వచ్చింది.