హోం మంత్రిని కలిసిన గుంటూరు రేంజ్ జైల్ డిఐజి
గుంటూరు రేంజ్ జైల్ డి.ఐ.జి డా౹౹ వరప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరితని మర్యాదపూర్వకంగా కలిసారు.
గుంటూరులోని బ్రాడిపేటలో హోం మంత్రి క్యాంప్ ఆఫీస్ లో సుచరితని కలిసి పుష్పగుచ్చెం అందించారు. ఈ సందర్భంగా డా౹౹ వరప్రసాద్ కి హోంమంత్రి మేకతోటి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు.
గుంటూరు రేంజ్ లో జైళ్ళ సమర్ధ నిర్వహణకు కృషి చేస్తానని, ఖైదీల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటామని గుంటూరు రేంజ్ జైల్ డి.ఐ.జి డా౹౹ వరప్రసాద్ పేర్కొన్నారు. సత్పవర్తన, పరివర్తన ఖైదీలలో వచ్చేలా తీర్చి దిద్దడమే జైళ్ళ లక్ష్యమని ఆయన అన్నారు.