శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (19:34 IST)

విద్యార్థి వైద్య ఖర్చులకు... తోటి విద్యార్థిని ఆర్థిక సహాయం

బ్రెయిన్‌కి ఇన్ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్న విద్యార్థికి తోటి విద్యార్థిని తన పుట్టినరోజు వేడుక జరుపుకోకుండా ఆ వేడుకకు సంబంధించి పెట్టె ఖర్చుకు సంబంధించిన నగదును విద్యార్థి వైద్య ఖర్చులకు ఇచ్చి... ఆ విద్యార్థిని టీచర్స్, పలువురు విద్యార్థుల ప్రశంసలు పొందింది. వివరాలు ఇలా ఉంటాయి.
 
తాడేపల్లి నులకపేటకు చెందిన పల్లపాటి మహర్షి అనే విద్యార్థి ఆత్మకూరు నిర్మల కాన్వెంట్‌లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. అయితే ఆ విద్యార్థికి గత నెల 23వ తేదీన ముక్కుకి ఇన్ఫెక్షన్ వచ్చి, అది కంటికి దాని నుంచి బ్రెయిన్‌కి చేరడంతో సీరియస్ అవడంతో తల్లిదండ్రులు విద్యార్థి మహర్షిని ఎన్నారై హాస్పటల్‌లో చేర్పించి వైద్యసేవలు అందిస్తున్నారు. 
 
ఇప్పటివరకు లక్షన్నర వరకు వైద్య ఖర్చులు అయ్యాయి. అయితే విద్యార్థి తండ్రి నాగరాజు రోజువారీగా సీలింగ్ పనిచేసుకునే కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అంతంత మాత్రంగా ఆదాయం ఉన్నా నాగరాజు విద్యార్థి సమస్యను కాన్వెంట్లో చెప్పగా కాన్వెంటు విద్యార్థి సహాయార్ధం విద్యార్థులచే విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద నుండి డబ్బులు వసూలు చేయిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఇదే కాన్వెంట్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న చినకాకానికి చెందిన డి జ్ఞానదీపిక వచ్చే నెలలో తన పుట్టినరోజు వేడుకకు అయ్యే ఖర్చును మా కాన్వెంట్‌లోని చికిత్స పొందుతున్న విద్యార్థి మహర్షికి ఆర్థిక సహాయంగా అందజేయాలని తల్లిదండ్రులను కోరింది. దీంతో తల్లిదండ్రులు సంతోషంగా అంగీకరించి, శుక్రవారం కాన్వెంట్లో విద్యార్థి మహర్షి తల్లికి విద్యార్థిని జ్ఞానదీపిక ఐదు వేలరూపాయల నగదు చెక్కును అందజేసింది. ఈ సందర్భంగా జ్ఞానదీపికను పలువురు టీచర్స్, సిబ్బంది అభినందించారు.