శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2019 (17:22 IST)

విలీనానికి పవన్ కళ్యాణ్ అంగీకరించలేదు : జీవీఎల్

గత ఎన్నికలకు ముందు తమ పార్టీలో జనసేన పార్టీని విలీనం చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరామని, కానీ, ఆయన విలీనానికి అంగీకరించలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్ నరసింహా రావు వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ విధానాలు నచ్చి, తమతో ఏకీభవించి విలీనానికి వచ్చే ఏ ప్రాంతీయ పార్టీని అయినా తాము స్వాగతిస్తామన్నారు. 
 
ఈ విషయమై చొరవ తీసుకోవాల్సి వస్తే తప్పనిసరిగా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కేవలం, తమ అవసరం కోసం బీజేపీని వాడుకుని, రాజకీయ అస్త్రాన్ని సందిద్దామనుకుంటే కనుక అది గ్రహించలేని పరిస్థితిలో బీజేపీ లేదని స్పష్టం చేశారు.