హయత్ నగర్ కిడ్నాప్ కేసు సుఖాంతం..
హైదరాబాద్ హయత్‌నగర్‌లో కిడ్నాప్‌కు గురైన బీఫార్మసీ విద్యార్థినిని కిడ్నాపర్లు అద్దంకిలో వదిలి వెళ్లారు. దీంతో ఈ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ చిరువ్యాపారిని నమ్మించి అతడి కుమార్తెను కారులో రవి శేఖర్ అనే కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడు. ఆ యువతి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన తెలంగాణ పోలీసులు... అద్దంకి బస్టాండులో యువతిని కిడ్నాపర్ రవి శేఖర్ వదిలివెళ్లినట్టు గుర్తించారు.
కిడ్నాపర్ మొబైల్ నంబరు నుంచి యువతి తండ్రి, మామయ్యతో ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కిడ్నాప్ అనంతరం కడప జిల్లా ఒంటిమిట్ట, తిరుపతి తీసుకెళ్లి అద్దంకి తీసుకు వచ్చి అక్కడ వదిలి వెళ్ళినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు... అద్దంకి నుండి యువతిని హైదరాబాద్‌కు తరలింపు... ఇప్పటి వరకు పోలీసులకు లభించని కిడ్నాపర్ రవి శేఖర్ ఆచూకీ తెలియలేదు.