శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జులై 2019 (09:53 IST)

దివి సీమలో వానాగాలి బీభత్సం....

దివి సీమలో సోమవారం తెల్లవారుజామున వానాగాలి బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వానా గాలి బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు, భారీ వర్షం కురవడంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. గాలివానకు ముందే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
అవనిగడ్డ మండలం బందలాయి చెరువు ఎస్సీ కాలనీలో మూడు చోట్ల భారీ వృక్షాలు పడి విద్యుత్ తీగలు తెగి పోయాయి. ఒకచోట భారీ వృక్షం 2 బడ్డీ కొట్లుపై పడటంతో అవి ధ్వంసమయ్యాయి. రాక పోకలు స్థంభించడంతో స్థానికులు చెట్లు నరకి అడ్డు తొలగిస్థున్నారు.
 
తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగడం వలన విద్యుత్ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. సాయంత్రం వరకు మరమ్మతులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఆ తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు.