అర్థరాత్రి అపార్టుమెంట్ గోడకూలి 17 మంది దుర్మరణం...
పుణెలో ఓ అపార్టుమెంట్ గోడ కూలి 17 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో అపార్ట్‌మెంట్ గోడ కూలి పక్కనే వున్న పూరి గుడెసెలపై పడింది. ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో తొమ్మిది మంది పురుషులు, నలుగురు చిన్నారులు, ఓ మహిళ వుండగా మిగిలినవారిని గుర్తించాల్సి వుంది.
కాగా కూలిన గోడ శిథిలాలను తొలగించి క్షతగాత్రులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్, పోలీసులు రంగంలోకి దిగారు. శిథిలాలను జేసీబీల సాయంతో తొలగించారు..