శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (17:30 IST)

రాత్రంతా సినిమాలు చూస్తోందని భార్యను చంపేసిన భర్త...

రాత్రంతా సినిమాలు చూస్తోందని ఓ భార్యను భర్త చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అంధేరిలో బుధవారం నాడు చోటు చేసుకుంది. చేతన్ చౌఘులే(32), ఆర్తి(22) దంపతులు అంధేరిలో నివాసముంటున్నారు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. అయితే ఆర్తి నిత్యం సినిమాలు చూస్తోంది. 


అటు టీవీలో కానీ.. ఇటు మొబైల్‌ ఫోన్‌లో కానీ సినిమాలు చూస్తూ ఆర్తి సమయాన్ని గడిపేస్తుంది. ఈ క్రమంలో చేతన్, ఆర్తి మధ్య అనేకసార్లు గొడవలు కూడా చోటు చేసుకున్నాయి. గొడవ జరిగినప్పుడల్లా తన రెండేళ్ల బాబును తీసుకొని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేది. 
 
అయితే రెండు రోజుల క్రితం ఇంటి సరుకులు కొనేందుకు ఆర్తి భర్తను డబ్బులు అడిగింది. అతను ఇవ్వలేదు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా బుధవారం రాత్రి భర్తను విడిచిపెట్టి, ఆ రాత్రంతా యూట్యూబ్‌లో సినిమాలు చూస్తుంది. శబ్దానికి చేతన్‌కు నిద్ర పట్ట లేదు. దీంతో భర్త బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆర్తి గొంతును నులిమి చంపేశాడు. 
 
ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి చేతన్‌ లొంగిపోయాడు. తాను రాత్రంతా సినిమాలు చూడడం వల్ల ఆ శబ్దానికి నిద్ర రావడం లేదు. గత కొన్ని రోజులుగా ఇదే జరుగుతుంది. తాను సహనం కోల్పోయి భార్య ఆర్తిని గొంతు నులిమి చంపేశాను అని చేతన్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.