శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 20 జూన్ 2019 (17:18 IST)

మహారాష్ట్ర: తరగతి గదిలో పైకప్పు స్లాబ్ ఊడి విద్యార్థుల తలపై పడింది (Video)

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అంతంత మాత్రంగానే వున్నాయి. తాజాగా మహారాష్ట్రలో విద్యార్థులు భయాందోళనకు గురయ్యే ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో కూర్చుని పాఠాలు వింటున్న విద్యార్థుల తలలో పిడుగు పడినట్లు.. ఆ భవనానికి పైకప్పు స్లాబ్ కిందపడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలైనాయి. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మహారాష్ట్ర, ఉల్హాన్స్‌నగర్‌కు చెందిన ఓ పాఠశాలలో టీచర్ పాఠాలు చెప్తుంటే.. విద్యార్థులు వింటూ వున్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి.. ఆ భవనం పైకప్పు నుంచి సిమెంట్ స్లాబ్ ఊడి విద్యార్థుల తలపై పడింది. దీంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. 
 
విద్యార్థుల్లో కొందరు తలపట్టుకుంటే.. మరికొందరు తలపై పడిన మట్టిని తొలగించుకుంటూ క్లాస్ రూమ్‌ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ ఈ వీడియోను ఓ లుక్కేయండి.