గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 16 నవంబరు 2021 (09:45 IST)

మరో రెండు రోజులు దక్షిణ కోస్తాలో భారీ వర్ష సూచ‌న‌!

బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడే అవకాశం లేదని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం దాదాపు పశ్చిమ దిశగా పయనిస్తూ, ఈనెల 18 నాటికి నైరుతి బంగాళాఖాతంపై దక్షిణాంధ్ర ఉత్తర తమిళనాడులకు చేరువగా కేంద్రీకృతం అవుతుంది. 
 
 
మొదట ఇది వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేశారు. కానీ అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడినందున ఇది బలపడే అనుకూలత లోపించింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో నేడు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చు. రేపు ఎల్లుండీ ఆ తర్వాత మరో రెండు రోజులూ దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడవచ్చు అని వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది.