బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

వాయుగుండంగా అల్పపీడనం.. కుంభవృష్టి ఖాయం

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా కుంభవృష్టి తప్పదని హెచ్చరించింది.

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా కుంభవృష్టి తప్పదని హెచ్చరించింది. ఏపీలోని కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు, రాయలసీమ, తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులు వీస్తాయని, భారీ వర్షాల కారణంగా వరదనీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
ఈమేరకు ఓ ప్రకటన చేస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అల్పపీడనద్రోణి, క్యుములోనింబస్, ఉపరితలద్రోణి తెలుగు రాష్ట్రాలపై పరుచుకుని ఉన్నాయని, మరో నాలుగైదు రోజుల పాటు వీటి ప్రభావం ఉంటుందని, ఆపై వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని, చలిగాలుల తీవ్రత పెరుగుతుందని పేర్కొంది.