గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2017 (15:41 IST)

ముంబైలో సునామీ అలెర్ట్: భారీ వర్షాలు..రైల్వే స్టేషన్లలో వరద నీరు (వీడియో)

దేశ వాణిజ్య నగరం ముంబైని వరదలు ముంచెత్తాయి. ముంబైలో 48 గంటల పాటు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు వచ్చేశాయి. రోడ్డు వరద నీటితో నిండిపోయాయి. వాహన రాకపో

దేశ వాణిజ్య నగరం ముంబైని వరదలు ముంచెత్తాయి. ముంబైలో 48 గంటల పాటు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు వచ్చేశాయి. రోడ్డు వరద నీటితో నిండిపోయాయి. వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నప్పటికీ వరద నీరు పారేందుకు తగిన సదుపాయాలను ప్రభుత్వం కల్పించలేదు. 
 
ముంబైలో పెరుగుతున్న జనాభా కారణంగా నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. వృక్షాలను నరికేయడం, ప్లాస్టిక్ వినియోగం అధికం కావడం ద్వారా వరద నీరు రోడ్లపైనే నిలిచిపోతున్నాయి. వాణిజ్య నగరమైనప్పటికీ డ్రైనేజీల్లో పూడికతీతపై కార్పొరేషన్ నిర్లక్ష్యం వహిస్తోంది. తద్వారా వర్షాలు పడుతున్నాయంటేనే ముంబై జనం జడుసుకుంటున్నారు. 
 
ఇకపోతే.. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మహావృక్షాలు కుప్పకూలాయి. ప్రజలు ఇంటికి పరిమితమవుతున్నారు. కార్యాలయాలకు వెళ్తే తిరిగి ఇంటికి చేరుకునే పరిస్థితి లేదు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మరో 48 గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే ముంబైలోని ఏడు చెరువులు నీటితో మునిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో ముంబై నగరానికి సునామీ హెచ్చరిక జారీ అయ్యింది. భారీ వర్షాల కారణంగా అల్పపీడన ద్రోణితో సముద్రపు అలలు భారీ ఎత్తున ఎగసిపడే ఛాన్సుందని వారు చెప్పారు. మంగళవారం 3.50 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగసిపడ్డాయి. బుధవారం ఈ అలల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వాధికారులు తెలిపారు.