శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (12:03 IST)

ఇకపై అక్కడ బహిరంగ మద్యపానం నిషేధం.. తాగితే ఫైన్

మన దేశంలో ఉన్న సముద్రతీర పర్యాటక ప్రాంతాల్లో గోవా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ విభిన్న సంస్కృతుల ప్రజలు నివసిస్తున్నారు. పైగా, విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతం కూడా. అదేసమయంలో గోవా బీచ్‌లో

మన దేశంలో ఉన్న సముద్రతీర పర్యాటక ప్రాంతాల్లో గోవా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ విభిన్న సంస్కృతుల ప్రజలు నివసిస్తున్నారు. పైగా, విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతం కూడా. అదేసమయంలో గోవా బీచ్‌లో విదేశీ మహిళలపై జరిగే నేరాలు ఘోరాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.
 
ఈనేపథ్యంలో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మందు కొడితే జరిమానాలు విధిస్తామని గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ వెల్లడించారు. దానికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపారు. పబ్లిక్‌గా మందు తాగితే రూ.2,500 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. ఆగస్టులోపే ఈ విధానం అమలు చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి అమలులోకి తెస్తామని సీఎం మనోహర్ పారీకర్ వెల్లడించారు. 
 
గోవా రోడ్లపై ఖాళీ బీరు సీసాలు పడి ఉంటున్నాయని… ఇటీవల అభివృద్ధి చేసిన రివర్‌ ఫ్రంట్ ప్రాంతంలో కాలేజీ విద్యార్థులు బీర్లు తాగుతూ కనిపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు బీరు బాటిళ్లు పట్టుకుని వెళ్తుండటం చూశానన్నారు. ఖాళీ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో మిగతా ప్రజలు తీవ్ర అసౌకర్యంగా ఫీలవుతున్నారని తెలిపారు.