తిరుపతిలో నవరత్నాల అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకం అమలుపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటయింది. తిరుపతి ఎస్వీయూ ఆడిటోరియంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, గృహ నిర్మాణ శాఖ సమీక్షనిర్వహించారు.
సమావేశంలో ఉప ముఖ్య మంత్రి కె.నారాయణస్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాధ రాజు, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ పాల్గొన్నారు. నవరత్నాల అమలు ఒక క్రమ పద్ధతిలో జరిగేలా ఉన్నతాధికారులు చూడాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.
పేదలకు ఇళ్ళ నిర్మాణంలో అధికారులు చురుకుగా పనిచేయాలని, ఏపీ సీఎం జగనన్న కాలనీల అభివృద్ధిపై సీరియస్ గా ఉన్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాధ రాజు అన్నారు. చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధి తమ లక్ష్యమని ఉప ముఖ్య మంత్రి కె.నారాయణస్వామి అధికారులకు స్పష్టం చేశారు.