శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 19 జులై 2021 (09:30 IST)

విజయవాడలో హైటెన్షన్

సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో విజయవాడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు సీఎం క్యాంప్  కార్యాలయం ముట్టడికి  విద్యార్థి మరియు యువజన సంఘాలు పిలుపునిచ్చాయి.

ఈ క్రమంలో నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే  టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ప్రతినిధులను అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాల కార్యాలయాలు, ఇళ్ల వద్ద పోలీసులు నిఘా ఉంచారు.