శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (21:56 IST)

విజయవాడ సింగ్ నగర్ గ్యాంగ్ వార్, సూర్యారావుపేట హత్య కేసులో నిందితులు అదుపులోకి...

ఈ నెల 25న రెండు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన ఆధిప‌త్య పోరులో భాగంగా సూర్యారావుపేట పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో మూడు రోజుల క్రితం జ‌రిగిన హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుల‌ను ప‌ట్టుకున్నారు సూర్యారావుపేట పోలీసులు.
 
ప‌క్కా స‌మాచారంతో నిన్న సాయంత్ర‌మే హ‌త్య కేసు ప్రధాన నిందితులు కుక్కల రవి, అశోక్, నిహాంత్‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
 
హత్య వెనక A+ రౌడీషీటర్ ఉన్నట్లు అనుమానం. రెండు నెలలుగా నున్న, సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ ప‌రిధిలో ఆధిప‌త్య పోరు కోసం ప‌లుమార్లు గ్యాంగ్ వార్‌ జరిగింది.

ప్రేమ వివాహం విష‌యంలో రౌడీషీటర్ల మధ్య ఆధిప‌త్య‌ పోరులో భాగంగానే హత్య జ‌రిగిన‌ట్లు విచార‌ణ‌లో గుర్తించిన‌ట్లు పోలీసులు తెలిపారు. నాలుగొవ నిందితుడైన క‌రీమ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.