1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (09:23 IST)

ఏపీలో నేటి నుంచి బడులకు సెలవు

ఏపీలో పాఠశాలలకు సాధారణ, దసరా సెలవులు ఒక్కసారిగా వచ్చాయి. శనివారం నుంచి ఈనెల 17వ తేదీవరకు సెలవులుండగా, 18న పునఃప్రారంభం కానున్నాయి.

అకడమిక్‌ క్యాలెండర్‌ 2021-22 ప్రకారం ఈనెల 11 నుంచి 16వ తేదీవరకు దసరా సెలవులున్నాయి. దీంతోపాటు తొమ్మిదో తతేదదీన రెండో శనివారం, 10, 17వ తేదీలు ఆదివారాలు రావడంతో అదనంగా మూడ్రోజులు సాధారణ సెలవులు వచ్చాయి.

కాగా.. రెండో శనివారాన్ని జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలల పనిదినంగా ప్రకటించాయి. ఇదిలా ఉండగా సెలవుల అనంతరం ఈనెల 21 నుంచి 30వ తేదీవరకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)-1 స్లిప్‌ టెస్టులు నిర్వహించి, ఆన్‌లైన్‌లో మార్పులు నమోదు చేయాలని అధికారులు సూచించారు.