సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (22:59 IST)

ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీలు తాత్కాలికంగా రద్దు

ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ట్రూ అప్ చార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తుది ఆదేశాలు ఉంటాయని ఈఆర్సీ పేర్కొంది.

ట్రూ అప్ చార్జీలు వసూలు చేసుకునేందుకు ఆగస్టు 27న ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. యూనిట్‌కు 40 పైసల నుంచి రూపాయి 23 పైసల వరకు ట్రూ అప్ చార్జీలను విద్యుత్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. రెండు నెలల నుంచి ట్రూ అప్ చార్జీలు వసూలు చేశాయి.
 
పత్రికా ప్రకటన ఇవ్వకుండా, ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోకుండా ట్రూ అప్ చార్జీల వసూళ్లపై వినియోగదారులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హైకోర్టులో పిటిషన్లు, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

ట్రూ అప్ చార్జీలను తాత్కాలికంగా రద్దు చేసింది. కాగా దసరా సెలవులు అనంతరం దీనిపై విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది.