గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (17:24 IST)

సంప‌త్ నంది - సింబాలో కీలక పాత్రధారిగా జ‌గ‌ప‌తిబాబు

Sampath nandi- Jagapati babu
నాగ‌రిక‌త పేరుతో మాన‌వుడు ప్ర‌కృతిని నాశ‌నం చేస్తున్నాడు. మ‌నిషి మ‌నుగ‌డ‌కు కార‌ణమ‌వుతున్న చెట్ల‌ను న‌రికివేస్తూ కాలుష్యాన్ని పెంచేస్తున్నాడు. దీని వ‌ల్ల వ‌ర్షాలు లేక‌పోవ‌డంతో మ‌నిషికి ఎంతో అవ‌స‌ర‌మైన‌, జీవనాధార‌మైన‌ నీరు దొర‌క‌డం క‌ష్ట‌మైంది. చెట్ల‌ను కాపాడుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రిస్తూ..సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్‌, రాజ్ దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది, రాజేంద‌ర్ రెడ్డి. డి నిర్మాత‌లుగా రూపొందుతోన్న ‘సింబా’ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు భాగమయ్యారు. ఈ చిత్రంలో ఆయ‌న ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. సంప‌త్ నంది స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా ద్వారా ముర‌ళీ మ‌నోహ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.
 
కృష్ణ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి కృష్ణ సౌర‌భ్ సంగీతాన్ని అందిస్తున్నారు. రాజీవ్ నాయ‌ర్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ గా త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
 
కొంద‌రు మ‌నుషులు అడ‌విలోని చెట్ల‌ను న‌రికేస్తున్నారు. అడ‌వి పాడ‌వుతుండ‌టంతో జంతువుల‌న్నీ భ‌యంతో పారిపోతున్నాయి. అయితే అంత‌లో అడ‌వి మ‌నిషిగా ఉంటూ అడ‌విలో జీవించే మ‌న క‌థానాయ‌కుడు `సింబా` చెట్టు న‌రుకుతున్న వాడిపైకి న‌రికిన చెట్టును ఆయుధంగా చేసుకుని దాడి చేస్తాడు. `మ‌న‌కు బ్ర‌తుకునిచ్చే మొక్క‌ని బ్ర‌త‌క‌నిద్దాం` అనే లైన్ ద్వారా సినిమా, హీరో పాత్ర‌ ఎలా ఉండ‌బోతుందనే విష‌యాన్ని తెలియ‌జేసేలా రీసెంట్‌ యూనిట్ విడుద‌ల చేసిన వీడియోకు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.