సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

రైలు ప్రమాదంలో నజ్జునుజ్జయిన ఏడు బోగీలు... పొలాల్లో దివ్యాంగుల బోగీ...

train collision
విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు ప్యాసింజర్ రైళ్ళు, ఒక గూడ్సు రైలుకు చెందిన ఏడు బోగీలు నుజ్జు నుజ్జయ్యాయి. విశాఖ - రాయగడ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పొలాల్లో పడిపోయింది. దాని వెనుక ఉన్న డీ1 బోగీ వేగానికి కొంత భాగం పైకి లేచింది. 
 
ఈ ఘోర ప్రమాద తీవ్రతకు అద్ద పట్టేలా ప్రమాద స్థలంలో బీతావహ పరిస్థితులు ఉన్నాయి. సిగ్నల్ కోసం ట్రాక్‌పై ఆగివున్న విశాఖ - పలాస ప్యాసింజర్ రైలును వెనుక నుంచి వచ్చిన విశాఖ - రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టిడంతో ఈ దుర్ఘటన జరిగింది. విశాఖపట్టణం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖ - పలాస రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖ - రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. 
 
ప్రమాదం జరిగినపుడు రాయగడ రైలుకు చెందిన కొన్ని బోగీలు పక్క ట్రాక్‌పై ఆగివున్న గూడ్సు రైలును ఢీకొన్నాయి. రెండు ప్యాసింజర్ రైళ్లు, గూడ్సు రైళ్ళలో కలిపి ఏడుబోగీలు నుజ్జు నుజ్జయ్యాయి. గూడ్సు రైలుపైకి పలాస ప్యాసింజర్ రైలుకు చెందిన రెండు బోగీలు దూసుకెళ్లడంతో పట్టాలు పైకి లేచి, దానికింద తలకిందులుగా రైలు దూసుకెళ్లిన తీరు రైలు ప్రమాదానికి అద్దంపడుతున్నాయి. వెనుక నుంచి ఢీకొట్టిన రాయగడ రైలు ఇంజిన్‌పైకి ఆ రైలు బోగీలో మూడు పైకెక్కి, పక్కనే ఉన్న గూడ్సు రవాణా రైలును ఢీకొట్టాయి. విశాఖ - రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పొలాల్లో పడిపోయింది.