టిటిడి ఆలయంలో అస్థికలు బయటపడుతున్నాయి...
చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేద నారాయణస్వామి ఆలయంలో మట్టి తవ్వుతుంటే అస్థికలు బయటపడుతున్నాయి. స్వామివారి రథాన్ని నిలిపేందుకు ఒక షెల్టర్‌ను టిటిడి ఏర్పాటు చేయడానికి సిద్థమైంది. కొంతమంది కూలీలను ఆలయంలో బేస్‌మెంట్ త్రవ్వడానికి కాంట్రాక్ట్ మాట్లాడుకుంద
చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేద నారాయణస్వామి ఆలయంలో మట్టి తవ్వుతుంటే అస్థికలు బయటపడుతున్నాయి. స్వామివారి రథాన్ని నిలిపేందుకు ఒక షెల్టర్‌ను టిటిడి ఏర్పాటు చేయడానికి సిద్థమైంది. కొంతమంది కూలీలను ఆలయంలో బేస్‌మెంట్ త్రవ్వడానికి కాంట్రాక్ట్ మాట్లాడుకుంది. కూలీలు త్రవ్వుతుండగా ఒక్కసారిగా అస్థికలు కనిపించాయి. త్రవ్వుతుంటే అస్థికలు వస్తూనే ఉన్నాయి. దీంతో భయాందోళనకు గురైన కూలీలు టిటిడి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు.
టిటిడి అధికారులు పోలీసులకు తెలుపగా కొంతమంది పరిశోధకులు అక్కడకు చేరుకుని ఆ అస్థికలను ల్యాబ్‌కు తీసుకెళ్ళారు. అస్థికలు మనుషులకు చెందినవిగా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరో వారం రోజుల్లో అక్కడున్న అస్థికలు ఎవరివన్నది తేలిపోనుంది. దీంతో పనులను కూడా టిటిడి ఆపివేసింది.