గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 31 డిశెంబరు 2020 (12:15 IST)

భార్యను కాల్ గర్ల్ అంటూ పోస్టులు పెట్టిన భర్త అరెస్ట్

కట్టుకున్న భార్యను కాల్ గర్ల్ అంటూ వాట్సాప్ ద్వారా పోస్టులు పెట్టిన శాడిస్ట్ భర్త రేవంత్‌ను అలిపిరి పోలీసులు అరెస్టు చేసారు. తితిదేకి చెందిన ఓ కళాశాలలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న రేవంత్ నాలుగు నెలల క్రితం నిరోషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఆ తర్వాత అదనపు కట్నం కావాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
 
డబ్బు తీసుకురావడంలేదన్న కోపంతో ఆమెను మానసికంగా, శారీరకంగా తీవ్ర హింసలకు గురి చేసాడు. ఇది చాలక వారిద్దరూ సన్నిహితంగా వున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి... గంటకు 3 వేలు, నా అడ్రెస్ ఇదేనంటూ దారుణానికి పాల్పడ్డాడు. కాల్ గర్ల్ అంటూ పోస్టులు పెట్టడంతో కొందరు ఇంటికి కూడా వచ్చేసారు. ఇదంతా తెలుసుకుని షాక్ తిన్న బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసింది.