గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (09:16 IST)

మగదిక్కు లేకపోవడంతో... అనూషకు అమ్మే అంత్యక్రియలు పూర్తి చేసింది...

మగదిక్కు లేకపోవడంతో డాక్టర్ అనూషకు అమ్మే అంత్యక్రియలు పూర్తి చేసింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో డాక్టర్‌ అనూష (23) ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఆమె మృతదేహాన్ని శనివార

మగదిక్కు లేకపోవడంతో డాక్టర్ అనూషకు అమ్మే అంత్యక్రియలు పూర్తి చేసింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో డాక్టర్‌ అనూష (23) ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఆమె మృతదేహాన్ని శనివారం 52వ వార్డులోని స్వగృహానికి తీసుకువచ్చారు. మగ దిక్కు ఎవరూ లేకపోవడంతో ఆమె తల్లి రాధారాణి, సోదరి శిరీష అంత్యక్రియలు పూర్తి చేశారు. 
 
కాగా, విశాఖపట్టణంకు చెందిన అనూష హైదరాబాద్‌లోని బసవ తారకం కేన్సర్‌ ఆస్పత్రిలో ఫిజియో థెరపిస్టుగా పనిచేస్తూ వచ్చింది. అనూష మృతదేహాన్ని చూసేందుకు స్థానిక నేతలు, కాలనీ ప్రజలు, స్నేహితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
 
ఇదిలావుండగా, అనూష మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు అంటున్నారు. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించాలని కోరుతున్నారు.