మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (10:50 IST)

లలితా జ్యూవెలరీలో బంగారు బ్రాస్‌లెట్ చోరీ

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ఉన్న లలితా జ్యువెలర్స్‌ దుకాణంలో సిబ్బంది దృష్టి మళ్లించిన దొంగలు 92 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. సంస్థ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4 గంటలకు గుంపుగా వచ్చిన కొందరు కొనుగోలుదారులు అక్కడ విధుల్లో ఉన్న వ్యక్తి దృష్టి మళ్లించేలా చేసి రూ.3.5 లక్షల విలువ చేసే రెండు బంగారు గొలుసులు, ఒక బ్రాస్‌లెట్‌ చోరీ చేసినట్టు గుర్తించారు.
 
 
సంస్థలో ఇటీవలే నిర్వహించిన ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. సీసీ కెమెరాలను పరిశీలించగా గుంపుగా వచ్చిన వారిలో ఎవరో కాజేసినట్లుగా గుర్తించారు. పంజాగుట్ట పోలీసులకు మేనేజర్‌ కె.హరిసుందర్‌ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన క్రైమ్ టీమ్ దుకాణానికి వెళ్లి పరిశీలించారు.