ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (10:15 IST)

భార్యా పిల్లలను ఉరేసి చంపి ఖాకీలకు లొంగిపోయిన భర్త

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యతో పాటు తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపాడో కసాయి. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిలొంగిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యతో పాటు తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపాడో కసాయి. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిలొంగిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
హైదరాబాద్‌ నగరంలోని మీర్‌పేట జిల్లెలగూడకు చెందిన హరేందర్ గౌడ్, జ్యోతి అనే దంపతులకు అభిజిత్ (6), సహస్ర (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమోగానీ, హరేందర్ గౌడ్ తన భార్యతో పాటు.. ఇద్దరు పిల్లలను ఉరివేసి హత్య చేశారు. 
 
ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కాగా  కొద్దిరోజుల క్రితమే హరీందర్‌ ఉద్యోగం మానేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, వివరాలు సేకరిస్తున్నారు.